పని ప్రదేశాల్లో మహిళా సిబ్బందిపై వేధింపులకు పాల్పడితే సహించం

3చూసినవారు
పని ప్రదేశాల్లో మహిళా సిబ్బంది పట్ల వేధింపులకు పాల్పడితే కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సిద్ధిపేట పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్ హెచ్చరించారు. పట్టణంలోని పోలీస్ కన్వెన్షన్ హాల్లో లింగ వివక్షపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, పోలీస్ విభాగం అత్యంత క్రమశిక్షణతో కూడినదని, విధి నిర్వహణలో తోటి సిబ్బందితో మర్యాదగా ప్రవర్తించాలని, ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని, అంతా ఒకే కుటుంబంలా ఐక్యతతో పనిచేయాలని సూచించారు. యూనిఫాం పట్ల విధేయతతో ఉంటూ, వృత్తిపరమైన విలువలను కాపాడాలని సిబ్బందిని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్