
ఇకపై రూ.50 వేల నగదు జమకు పాన్ కార్డు అవసరం లేదు!
కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ మార్పుల ప్రకారం, ఒకే రోజులో రూ.50,000 కంటే ఎక్కువ నగదు జమ చేయడానికి ఇకపై పాన్ కార్డు అవసరం లేదు. అయితే, ఒక ఆర్థిక సంవత్సరంలో అన్ని బ్యాంకు ఖాతాల నుండి చేసే మొత్తం నగదు డిపాజిట్లు లేదా విత్డ్రాయల్స్ రూ.10 లక్షలు దాటితే పాన్ కార్డు అందించాల్సి ఉంటుంది. ఆస్తి కొనుగోళ్లు, అమ్మకాలకు పాన్ పరిమితి రూ.10 లక్షల నుండి రూ.20 లక్షలకు పెరిగింది. పాన్ లేని పక్షంలో పాత ఫారం 60కి బదులుగా కొత్త ఫారం 97 అవసరం అవుతుంది.




