సిద్ధిపేట జిల్లా నంగునూర్ కు చెందిన దాసరి మల్లవ్వ (మస్కట్) మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, మంగళవారం బాధిత కుటుంబానికి రూ. 5,000 ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేవని కో-ఆపరేటివ్ చైర్మన్ కోల రమేష్ గౌడ్ తెలియజేయడంతో హరీశ్ రావు సానుకూలంగా స్పందించి, తక్షణ సహాయం కింద ఈ మొత్తాన్ని కుల పెద్దల సమక్షంలో కుటుంబ సభ్యులకు అందించారు.