సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు లేఖ

2చూసినవారు
సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు లేఖ
రైతు సమస్యలపై సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులు పరిశీలించాలని, రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోళ్లు ఆలస్యమవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ వెంటనే చెల్లించాలని కోరారు. అలాగే శనగ, జొన్న, మొక్కజొన్న పంటలను కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పట్ల నిర్లక్ష్యం కొనసాగితే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్