కొండపాక మండల కేంద్రంలో పలు గ్రామాల్లో భారీ వర్షం

4చూసినవారు
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ, కొండపాక, విశ్వనాథపల్లి, రవీంద్ర నగర్, రాంపల్లి తదితర గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం 3 గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి వాతావరణంలో పలు మార్పుల వల్ల వర్షం కురుస్తుంది. ఇందులో భాగంగా మండల కేంద్రంలో ఉండే రైతులు వ్యవసాయ పొలంలో సాగుచేసినటువంటి పంటలకు ఈ వర్షం ఎంతో ఉపయోగపడుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజుల విరామం తర్వాత వర్షం కురవడంతో వేసిన పంటలకు కొంత ఊరట ఇస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్