సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో ఉరుము, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో విద్యుత్ సమస్యలు తలెత్తితే లైన్మెన్లకు సమాచారం అందించి, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మండల ఏఈ సత్యం సూచించారు. ప్రజలు విద్యుత్ స్తంభాల వద్ద ఉండరాదని, విద్యుత్ అంతరాయం ఏర్పడితే వెంటనే లైన్మెన్లకు తెలియజేయాలని, స్వయంగా మరమ్మతులు చేయకూడదని ఆయన హెచ్చరించారు.