బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబానికి గత పదేళ్ల పాలనలో వేల కోట్ల రూపాయల ఆస్తులు ఏ విధంగా వచ్చాయో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని సిద్దిపేట జిల్లా
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏలూరి కమలాకర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఒకప్పుడు పూట గడవడమే కష్టమన్నట్లు మాట్లాడిన కెసిఆర్, పదేళ్లు అధికారంలో ఉండేసరికి వేల కోట్లకు ఏ విధంగా అధిపతి అయ్యారో రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణకు కాపలాగా ఉంటానని నమ్మించి, అధికారంలోకి వచ్చాక కల్వకుంట్ల కుటుంబం రాష్ట్ర ప్రజల సంపదను, భూములను విచ్చలవిడిగా దోచుకుందని ఆరోపించారు.