
చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లలో మార్పు లేదు: కేంద్రం
మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఆధారపడే పోస్టాఫీసు, పీపీఎఫ్ వంటి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి (జూన్ 30 వరకు) వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సుకన్య సమృద్ధి యోజనపై 8.2%, పీపీఎఫ్ పై 7.1%, ఎన్‌ఎస్‌సిపై 7.7%, కిసాన్ వికాస్ పత్రపై 7.5%, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌పై 7.4%, మూడేళ్ల టర్మ్ డిపాజిట్లపై 7.1%, పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాపై 4% వడ్డీ రేట్లు కొనసాగుతాయి.




