అవకాశం వస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని సిద్దిపేట జిలా అక్బర్ పేట భూంపల్లి మండలం అల్మాజపూర్ గ్రామ మాజీ సర్పంచ్ వంగ మంజుల నరసింహారెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో సర్పంచ్‌గా గ్రామాభివృద్ధికి శాయశక్తులా కృషి చేశానని గుర్తుచేశారు. ప్రజలకు మరింత విస్తృతంగా సేవ చేసేందుకు, మండలాభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ఎంపీటీసీ స్థానం ఒక మంచి వేదిక అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అధిష్టానం, పార్టీ శ్రేణులు, గ్రామ ప్రజల మద్దతుతో ముందుకు సాగుతానని వివరించారు.