విచారణ పేరుతో కేసీఆర్ ను వేదిస్తే ఆందోళనలు ఉదృతం చేస్తాం

1చూసినవారు
సిట్ విచారణ పేరుతో మాజీ సీఎం కేసీఆర్ ను వేధిస్తే ఆందోళనలు మరింత ఉదృతం చేస్తామని సర్పంచ్ పాకాల శ్రీనివాస్ హెచ్చరించారు. విచారణ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అచ్చిన మల్లయ్య విమర్శించారు. ఈ నేపథ్యంలో, ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం మగ్ధూంపూర్ గ్రామంలో మాజీ సీఎం కేసీఆర్ పై సిట్ విచారణను నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్