మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆదేశాల మేరకు, సిద్ధిపేట జిల్లా నంగునూరు, అక్కేనపల్లి గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నంగునూరు పిఎసిఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్ గురువారం సందర్శించారు. రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, రైతులు తమ ధాన్యాన్ని టార్పాలిన్లతో కప్పుకొని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. అలాగే, అధిక ఎండల దృష్ట్యా, హమాలీలు ఉదయం 7 నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు మాత్రమే పని చేయాలని తెలిపారు.