సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురైన సేవలాల్ మహారాజ్ తండా రైతుల భూములను మంగళవారం తహసీల్దార్ సింహాచలం మధుసూదన్ పరిశీలించారు. రైతుల పట్టాలు, భూ విస్తీర్ణం వివరాలు సేకరించారు. అయితే, ప్రాజెక్టు పరిధిలోని 99 శాతం భూములు ప్రభుత్వ, సీలింగ్ భూములు కావడంతో కొత్త పట్టాలు ఇవ్వడం, ఆన్‌లైన్ నమోదు చేయడం సాధ్యం కాదని తహసీల్దార్ తెలిపారు. పూర్తి నివేదికను ఆర్డీఓ, జిల్లా కలెక్టర్‌కు పంపినట్లు ఆయన వెల్లడించారు. ఈ పరిశీలనతో రైతులకు నిరాశే మిగిలింది.