అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోచబోయిన శ్రీహరియాదవ్, యాదవులు అన్ని రంగాల్లో రాణించడం అభినందనీయమని అన్నారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన యాదవ అడ్వకేట్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యాదవులు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రాణిస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శులుగా, కార్యవర్గ సభ్యులుగా గణనీయంగా ఎన్నిక కావడం ఆహ్వానించదగ్గ పరిణామమని తెలిపారు.