హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక

4చూసినవారు
హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక
సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలం మత్ పల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు శుక్రవారం మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేసిందని, గ్రామాభివృద్ధికి సహకరించలేకపోతున్నామని, తెలంగాణ అభివృద్ధి కేసీఆర్, హరీష్ రావు వల్లే సాధ్యమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్