సిద్దిపేట స్వచ్ఛ బడి కొత్తగా ఉందని కర్ణాటక రాష్ట్ర రామ్ దుర్గ్ మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు అన్నారు. శనివారం వారు సిద్దిపేట మున్సిపల్ ను సందర్శించి, స్వచ్చ బడిలో డిజిటల్ క్లాస్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం వార్డు స్థాయి కంపోస్టు యార్డులో తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువుల తయారీ గూర్చి ఆరా తీశారు. అలాగే తడి చెత్త ద్వారా బయోగ్యాస్ తయారీ విధానం గురించి తెలుసుకున్నారు.