
తొక్కిసలాట.. బాధితుల ఆర్తనాదాలు (వీడియో)
AP: శ్రీకాకుళం కాళీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏకాదశి రోజు గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన ఆలయంలో బాధితుల హాహాకారాలతో హృదయ విదారకంగా మారింది. ఆలయ పరిసరాలు భక్తుల ఆర్తనాదాలతో నిండిపోయాయి. ఒక్కసారిగా దర్శనానికి గేట్లు ఓపెన్ చేయడంతో తోపులాట జరిగింది. ఈ ప్రమాదంతో 9 మంది మృతి చెందగా.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.




