కార్తీక మాసం సందర్భంగా, జిల్లా కేంద్రంలోని స్థానిక ఉమాపార్దీవ కోటిలింగేశ్వర ఆలయంలో జిల్లా కలెక్టర్ హైమావతి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయ సిబ్బంది, అర్చకులు కలెక్టర్‌కు ఘన స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు.