సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సత్తిరెడ్డి బుధవారం కొమురవెల్లి మండలంలోని మర్రి ముచ్చాల గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వడ్ల గింజను కొనుగోలు చేస్తామని, రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని చెబుతూ కాలక్షేపం చేస్తోందని, కానీ వాస్తవానికి మార్కెట్లో రైతుల గోస వర్ణనాతీతంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల దగ్గర వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం మాటలతోనే మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు.