సిద్దిపేట జిల్లా పద్మనాభునిపల్లికి చెందిన గాయకుడు, రచయిత ముక్కపల్లి శ్రీనివాస్ రచించిన "రావయ్యా మా పెద్దసారు" పాటను మాజీ మంత్రి
కేటీఆర్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
కేసీఆర్ నాయకత్వం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించే ఈ పాటను
కేటీఆర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎర్రోళ్ల శ్రీనివాస్, నిర్మాత నాగరాజు, జర్నలిస్టు చిన్ని కృష్ణ, ఉపాధ్యాయులు బాలయ్య, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పాట ఆవిష్కరణ రెండు వేల ఇరవై ఆరు, జూన్ రెండున జరిగింది.