సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని కేశవపూర్, మంచిలబండ, మీర్జాపూర్, వంకాయ తండా, కట్కూర్ గ్రామాల్లో శుక్రవారం మే డే సందర్భంగా కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల్లో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమాలకు కామ్రేడ్ గన్నబోయిన వెంకటాద్రి ముఖ్య అతిథిగా హాజరై ఎర్రజెండా ఆవిష్కరించారు. కట్కూర్ గ్రామంలో సుమారు 100 మంది కార్యకర్తల ఆధ్వర్యంలో ర్యాలీ, పాటలతో ఉత్సాహభరితంగా మే డే వేడుకలు నిర్వహించారు. అనంతరం మాట్లాడిన కామ్రేడ్ వెంకటాద్రి ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గంపై చేస్తున్న అన్యాయాలను వివరించారు.