బాలల కథల సంకలనం 'గ్రామ కోకిల' ఆవిష్కరణ

401చూసినవారు
బాలల కథల సంకలనం 'గ్రామ కోకిల' ఆవిష్కరణ
సిద్దిపేట జిల్లా, సిద్దిపేటలో బాల రచయితలు రాసిన కథల సంకలనం 'గ్రామ కోకిల' పుస్తకావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా సినీనటుడు, రచయిత జబర్దస్త్ లక్ష్మికిరణ్ మాట్లాడుతూ సాహిత్యం సమాజ హితమని, బాల రచయితల కలం నుండి జాలువారిన ప్రతి రచన లోకహితమని అన్నారు. కల్మషం లేని బాలల లోకం నిత్యం పూలవనం అవుతుందని, చిన్నప్పుడే కథలు రాస్తున్న చిన్నారుల భవిష్యత్ బంగారుమయం అవుతుందని ఐతా చంద్రయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి, గరిపల్లి అశోక్, సర్పంచ్ జక్కుల శ్రీలత శ్రీనివాస్, ఉపసర్పంచ్ గందె నరేష్, వరుకోలు లక్ష్మయ్య, ఉండ్రాళ్ళ రాజేశం, నరసింహారావు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ పుస్తకావిష్కరణ జనవరి 29, 2026న జరిగింది.

సంబంధిత పోస్ట్