ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చట్ట పరమైన చర్యలు

412చూసినవారు
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చట్ట పరమైన చర్యలు
చేర్యాల మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ నియమావళిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సిద్ధిపేట జిల్లా పోలీసు కమిషనర్ రష్మీ పెర్మల్ హెచ్చరించారు. గురువారం చేర్యాల మున్సిపల్ పరిధిలోని ఎన్నికల నామినేషన్ సెంటర్‌ను పరిశీలించిన సీపీ, ఎన్నికలకు పటిష్టమైన భద్రతను పోలీసు శాఖ ఏర్పాటు చేస్తుందని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా సీఐ భానోతు రమేష్, ఎస్సై నవీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.నాగేందర్, సీనియర్ అసిస్టెంట్ కృష్ణ సీపీ వెంట ఉన్నారు.
Job Suitcase

Jobs near you