ప్రజాస్వామ్య వ్యవస్థలో, ముఖ్యంగా రాజకీయ పార్టీల ఎన్నికల ప్రక్రియలో ప్రజలే రాజులని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ అన్నారు. గురువారం చేర్యాల జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికలు ఢిల్లీ, హైదరాబాద్ స్థాయివి కావని, ఇవి కేవలం గల్లీ స్థాయి ఎన్నికలని తెలిపారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉండి, స్థానిక అవసరాల కోసం ప్రజల మధ్య ఉంటూ పనిచేసే నాయకులకే పట్టం కట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.