సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి, ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులకు వెంటనే రుణాలు అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో జరిగిన సమీక్ష సమావేశంలో, పాడి పశువులు, సోచార్ యూనిట్లకు సబ్సిడీ ఉన్నందున ఒక్క యూనిట్ కూడా మిగలకుండా గ్రౌండింగ్ చేయాలని సూచించారు. మండల స్థాయిలో కమిటీ ఆమోదం పొందాక, జిల్లాస్థాయిలో చర్చించి లబ్ధిదారులకు రుణాలు అందించాలని తెలిపారు.