పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ సరైన వేదికని సిద్దిపేట ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ న్యాయమూర్తి జయప్రసాద్ అన్నారు. సిద్దిపేట న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో రాజీ మార్గం ద్వారా పలు కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ లో 4,274 క్రిమినల్, 32 సివిల్ కేసులు పరిష్కరించినట్లు తెలిపారు.