బెజ్జంకిలో ఘనంగా మాదిగ అమర వీరుల దినోత్సవ వేడుకలు

1చూసినవారు
బెజ్జంకిలో ఘనంగా మాదిగ అమర వీరుల దినోత్సవ వేడుకలు
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఆదివారం, మార్చి 1న ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ పోరాట ఫలితంగానే నేడు అమలులోకి వచ్చిందని తెలిపారు. బెజ్జంకి మండల అధ్యక్షులు వడ్లూరి పర్శరాములు మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకోవడం మన బాధ్యత అని గుర్తుచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్