రెడ్డి సంఘం మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా మమత రెడ్డి

4చూసినవారు
రెడ్డి సంఘం మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా మమత రెడ్డి
తెలంగాణ రెడ్డి సంఘం మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా సిద్దిపేట జిల్లాకు చెందిన నాయకురాలు బత్తుల మమతా రెడ్డి నియమితులయ్యారు. హైదరాబాద్ చంపాపేట్‌లోని సంఘ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ఆమెకు నియామక పత్రాన్ని అందజేసినట్టు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సంఘ సిద్ధాంతాలకు కట్టుబడి, క్షేత్రస్థాయిలో మహిళా విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మమతా రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్