సిద్దిపేట జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

85చూసినవారు
సిద్దిపేట జిల్లా ములుగు గ్రామానికి చెందిన తీగుళ్ల నెహ్రూ రెండు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఈ రోజు నెహ్రూ మృతదేహం మద్దూరు మండలం గాగిల్లాపూర్ చెరువులో కనిపించింది. చేతులు, కాళ్లు కట్టి శరీరానికి రాళ్లు కట్టి పడేసిన దుండగులను పోలీసులు పట్టుకోవాలని కుటుంబ సభ్యులు స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు.

సంబంధిత పోస్ట్