పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య

2చూసినవారు
పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బల్దియా పరిధి ముట్రాజ్ పల్లి కాలనీలో శుక్రవారం మతిస్థిమితం సరిగా లేని బోండ్ల మల్లేశం (47) అనే కూలీ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్నేళ్ల క్రితం భార్య, ముగ్గురు పిల్లలతో హైదరాబాద్ వలస వెళ్లిన మల్లేశం, మద్యానికి బానిసై మతిస్థిమితం కోల్పోయాడు. నెల కిందట ముట్రాజ్ పల్లికి వచ్చిన అతను పురుగుమందు తాగడంతో స్థానికులు అతన్ని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందడంతో, భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్