సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా, ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం సిద్ధిపేట జిల్లాలోని పలు ఆలయాలను మంగళవారం మూసివేయనున్నారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి ఆలయం, వర్గల్ మండలం నాచగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, వర్గల్ విద్యాధరి క్షేత్రం, వేణుగోపాలస్వామి ఆలయాలు మధ్యాహ్నం 3:20 నుండి మరుసటి రోజు ఉదయం 6:00 గంటల వరకు మూసివేయబడతాయి. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయ సంప్రోక్షణ, నైవేద్యం అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నారు.