సిద్దిపేట జిల్లా కొండపాక మండలం రాంపల్లి గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రోజున నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయకుని సన్నిధిలో సామూహిక కుంకుమ అర్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మహిళలు భక్తి పాటలతో మంగళ హారతులతో వేడుకను మరింత భక్తిమయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.