2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని, రున్తుం ఆర్ట్ గ్యాలరీలో ప్రముఖ చిత్రకారుడు రుస్తుం 'నూతనోత్సాహం కొత్త సంవత్సరం వర్ధిల్లాలి, ఇండియన్ యూనిటీ' పేరుతో చిత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన సంవత్సరం పేదల బాధలు, నిరుద్యోగ సమస్యలను పారద్రోలి, యువత కొత్త నైపుణ్యాలతో ప్రపంచవ్యాప్తంగా ఐక్యత, శాంతి, అభివృద్ధి, జీవనోపాధిలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శనం కావాలని ఆయన అభిలషించారు.