ఆదివారం నంగునూర్ మండల కేంద్రంలో శ్రీ భక్తాంజనేయ స్వామి పునః ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఈ సంవత్సరం కరువు వస్తుందనే ప్రచారాలను ప్రస్తావిస్తూ, ఆంజనేయ స్వామి అనుగ్రహంతో కరువును పారద్రోలి వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థించారు. ఎన్నో ఏళ్ల నాటి భక్తాంజనేయ స్వామి దేవాలయ పునః ప్రతిష్టా కార్యక్రమం జరగడం సంతోషకరమని, భవిష్యత్తులో నంగునూర్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన స్వామిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు.