సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహాస్వామి ఆలయ జాతర మహోత్సవాలకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించి, ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆలయ కమిటీకి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ జెల్ల ప్రభాకర్, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.