పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన మోడల్ స్కూల్ విద్యార్థులు

0చూసినవారు
పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన మోడల్ స్కూల్ విద్యార్థులు
బుధవారం వెలువడిన పదో తరగతి పరీక్షల ఫలితాలలో సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని పిఎంశ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ ఇబ్రహీంనగర్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. పాఠశాల ప్రిన్సిపాల్ సతీష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 93 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, అందరూ వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎస్. సాయికిరణ్ రెడ్డి 563, ఆకుల శ్రీజ 559, మహాదేవ్ మహర్విత 554, పి. మీనాక్షి 551 మార్కులతో అత్యధిక ప్రతిభ కనబరిచిన విద్యార్థులు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్