సిద్ధిపేట పట్టణంలోని స్థానిక సరస్వతి శిశుమందిర్ లో జిల్లా సప్తశక్తి సంగం ఆధ్వర్యంలో ఆదివారం మాతృ సమ్మేళనం నిర్వహించబడుతుందని ప్రధానోపాధ్యాయుడు నరేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ వ్యవస్థ, పర్యావరణంపై భారతీయ దృక్పథాన్ని పెంపొందించడం, పిల్లల సమగ్ర అభివృద్ధిలో తల్లి పాత్ర, పిల్లలు తల్లిని గౌరవించడం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించబడుతుంది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.