వాహనదారులు నీటి ప్రవాహాన్ని చూసుకుంటూ వాహనాలు నడపాలి

780చూసినవారు
వాహనదారులు నీటి ప్రవాహాన్ని చూసుకుంటూ వాహనాలు నడపాలి
భారీ వర్షాల నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్ సూచించారు. గురువారం సిద్దిపేటలో, ఏసిపి సుమన్ కుమార్, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, హెచ్ కె ఆర్, ఫైర్ సర్వీస్ సిబ్బందితో కలిసి మందపల్లి గ్రామశివారులో రాజీవ్ రహదారిపై భారీ వర్షం వల్ల ఏర్పడిన నీటి ప్రవాహాన్ని సరిచేసి, రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. వాహనదారులు నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్