మాజీ మంత్రి, సిద్దిపేట శాసన సభ్యులు తన్నీరు హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ మృతి చెందిన నేపథ్యంలో, శనివారం కోకాపేటలోని క్రిన్స్ విల్లాస్ లో సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ కడవేరుగు మంజుల రాజనర్సు, సిద్దిపేట మున్సిపల్ పాలకవర్గం మహిళా కౌన్సిలర్లు వారి నివాసానికి వెళ్లి తన్నీరు సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరీశ్ రావుని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరితో పాటు కౌన్సిలర్లు వంగ రేణుక తిరుమల్ రెడ్డి, వరాల కవిత సురేష్ తదితరులు పాల్గొన్నారు.