సిద్దిపేట జిల్లాలో డాక్టర్స్ డే సందర్భంగా ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ మురళీకృష్ణను అఖిల భారత యాదవ మహాసభ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మామిండ్ల ఐలయ్య యాదవ్ బుధవారం సత్కరించారు. ఈ సందర్భంగా ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ అన్ని వృత్తులలో వైద్య వృత్తి ప్రధానమైనదని, మనిషికి జీవం పోసే వైద్యులు గొప్పవారని, పునర్జన్మ ఇచ్చేది వైద్యులని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కవులు ఉండ్రాళ్ల రాజేశం, కాల్వ రాజయ్య, బొల్లు రాము యాదవ్, చింతల బాల్ నర్సయ్య, జక్కుల రాజేశం, అక్కెం ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.