నర్మెట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన బొమ్మిడి అనే విద్యార్థిని పదవ తరగతి పరీక్షల్లో 600కు 587 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా డీఈవో శ్రీనివాసరెడ్డి అమూల్యను, ఆమె ఉపాధ్యాయులను అభినందించారు. పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.