సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలం రామచంద్రపురం గ్రామ శివారులో రాజీవ్ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొట్టడంతో మంగోల్ గ్రామానికి చెందిన లగిశెట్టి వెంకటేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గజ్వేల్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న వెంకటేష్‌ను హనుమాన్ దేవాలయం వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న కుకునూర్ పల్లి 108 సిబ్బంది వెంకటేష్‌ను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అతన్ని ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.