సిద్ధిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు శుక్రవారం మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 17 మందికి జరిమానా విధించారు. ఇటీవల ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 17 మంది మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిలో 16 మందికి రూ. 1,63,000 జరిమానా విధించగా, ఒకరికి మూడు రోజుల జైలు శిక్ష పడింది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన మరో ఇద్దరికి రూ. 10,000 జరిమానా విధించారు.