తెలంగాణ జాగృతి జిల్లా నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులకే పార్టీలో గుర్తింపు ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై తెలంగాణ జాగృతి అన్ని మున్సిపాలిటీల్లో పోటీ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో సిద్దిపేట నుంచి కల్వకుంట్ల కవిత ఎన్నికల సమర శంఖం పూరిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు పాల్గొన్నారు.