బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే ధ్యేయంగా ఆపరేషన్ స్మైల్

0చూసినవారు
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే ధ్యేయంగా ఆపరేషన్ స్మైల్
సిద్దిపేట పోలీసు కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే ధ్యేయంగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ శాఖల సమన్వయంతో జిల్లాలో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని, ప్రత్యేక డ్రైవ్‌లో 70 మంది చిన్నారులను రక్షించినట్లు చెప్పారు. వీరిలో 52 మంది బాలురు, 18 మంది బాలికలు ఉన్నారని, ఇతర రాష్ట్రాలకు చెందిన 49 మంది బాలకార్మికులను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 12 మంది యజమానులపై కేసులు నమోదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్