మాజీమంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 'కొంతమంది ఐపీఎస్ అధికారులు మా ఫోన్లు, మా ఇళ్ల ముందు ఉన్న సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తున్నారు. బెంగళూరు నుండి ప్రైవేట్ హ్యాకర్లను తెచ్చి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూంలో వాళ్ళను పెట్టి బీఆర్ఎస్ నాయకుల మీద నిఘాపెడుతున్నారు. మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి.. టైం వచ్చినప్పుడు అన్ని బయటపెడుతాం. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రిటైరైనా మిమ్మల్ని వదలం' అని హెచ్చరించారు.