సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ ఆదివారం విద్యార్థుల బస్సుల భద్రతా ప్రమాణాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పాఠశాల బస్సులకు తప్పనిసరిగా ఆర్సీ, ఫిట్నెస్ ఉండాలని, వేగం 40 కి.మీ. మించరాదని, చిన్న పిల్లలున్న బస్సుల్లో లేడీ అటెండెంట్/కండక్టర్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. భద్రతా ప్రమాణాలు పాటించని బస్సులపై ఆర్టీవో లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని తల్లిదండ్రులకు సూచించారు.