సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద శుక్రవారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 41వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు. పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆత్తు ఇమామ్, గ్యాదరి మధు, మార్క సతీష్ గౌడ్, పూజల గోపికృష్ణ, వహాబ్, రాజ్ బహదూర్ రెడ్డి, అశోక్ గౌడ్, బీజాన్ బి. విజయ్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.