మన ఊరు మన బడి కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులు వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసానికి వచ్చిన కాంట్రాక్టర్లు, అప్పులు చేసి పనులు చేశామని, బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్ల కోసం పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్న రేవంత్ రెడ్డికి చిన్న కాంట్రాక్టర్ల సమస్యలు కనిపించడం లేదా అని హరీశ్ రావు ప్రశ్నించారు.