దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా భక్తులతో ఆలయం కిటకిటలాడింది. అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించి, అమ్మవారికి ఒడిబియ్యాన్ని పోశారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. మరి కొందరు పట్నాలు వేశారు. బైండ్ల వారి ఆటపాటలు, శివసత్తుల పూనకాలతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.