సిద్దిపేట జిల్లా, అక్కన్నపేట మండల పరిధిలో సాదాబాయన ద్వారా 2020లో మీ సేవలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న రైతులకు సోమవారం అక్కన్నపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో నోటీసులు అందజేశారు. జీపీవో గంగరాజు మండల పరిధిలో 480 నోటీసులను పంపిణీ చేశారు. అర్హులైన రైతులకు పట్టాలు మంజూరు చేస్తామని, రైతులు వెంటనే సంబంధిత పత్రాలతో విచారణకు హాజరై సహకరించాలని సూచించారు.